లెక్చరర్ కు దేహశుద్ధి
విశాఖపట్నం : భార్య బతిగి వుండగానే మరో పెళ్ళికి సిద్దపడిన లెక్చరర్ కు బాధిత కుటుంబ సభ్యులు చికతబాది పోలీసులకు అప్పగించారు. విశాఖజిల్లా అనకాపల్లి లక్ష్మీదేవి పేట నివాసి కొణతాల సత్యనూక వెంకటప్రసాద్ శ్రీకాకుళం జిల్లా రాజాం కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి గతంలో తూర్పుగోదావరి జిల్లా గోకవరం పట్టణానికి చెందిన యువతితో వివాహం అయ్యింది. ఆ విషయాన్ని దాచి పెట్టి మరో పెళ్లికి సిద్దపడ్డాడు. నిశ్చితార్థం కూడా జరిగిపోయినాక అతనికి ఇంతకు ముందే పెళ్ళైందని బంధువుల ద్వారా తెలుకున్న వధువు తల్లితండ్రులు నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో లెక్చరర్ పరారయ్యాడు. దీంతో అతన్ని వెదికి తీసుకువచ్చి గ్రామపంచాయితీ పెట్టడంతో బంధువులు, స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. పరిస్థితి శృతి మించుతున్న సమయంలో వచ్చిన పోలీసులు అతన్నిఅరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 22 May, 2009
|