క్యాబినెట్లో జిల్లా టాప్
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృంలోని కొత్త మంత్రి వర్గంలో జిల్లా నుంచి నలుగురికి మంత్రి పదవులు దక్కాయి. సోమవారం సాయంత్రం రాజభవన్ లో జరిగే కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సంలో కన్నా లక్ష్మీనారాయణ, గాదె వెంకట రెడ్డి, మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో తొలి జాబితాలో అత్యధిక మంత్రి పదవులు దక్కిన జిల్లాగా గుంటూరు రికార్డు దక్కించుకుంది. కన్నా ఇప్పటివరకూ అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు.
News Posted: 25 May, 2009
|