విశాఖపట్టణం: జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. రోలుగుంట మండలం ఏకే పట్టణంలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు.