విశాఖపట్నం : యోగంపేటలో ఓ యువకునిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ తో దాడి చేశారు. విశాఖజిల్లా గొలగొండ మండలం యోగంపేటలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. యాసిడ్ దాడిలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.