దుర్గమ్మ సేవలో మంత్రి మోపిదేవి
విజయవాడ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిలో కొలువున్న దుర్గమ్మను సాంకేతిక విద్యాశాఖమంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఆహ్వానం పలికి అమ్మవారి అంతరాలయంలోకి తీసుకెళ్ళారు. మంత్రి తో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. అధికారులు అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ కు మరోసారి పట్టం కట్టాయన్నారు. సిఎమ్ తనకు అప్పజెప్పిన విద్యాశాఖ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాన్నారు.
News Posted: 28 May, 2009
|