విశాఖపట్నం : విశాఖ జిల్లా రావికమతం మండలం సిరిసింగంలో చిరుతపులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులి ఎక్కడ తమపై దాడికి పాల్పడుతుందోనని వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.