రేంజర్ నివాసంపై ఏసీబీ దాడి
విశాఖపట్నం : అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాడేరు అటవీశాఖ రేంజర్ శాంతిస్వరూప్ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. శాంతిస్వరూప్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాడుల్లో ప్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, పెద్ద ఎత్తున ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 11 June, 2009
|