పట్టాలు తప్పిన గూడ్స్
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, బాతువా రైల్వేస్టేషన్ వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బాతువా వద్ద స్టేషన్ గూడ్స్ రైల్ హాల్ట్ ను ఎత్తివేయడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురైయ్యారు. దీనికి నిరసనగా వారు రైలు పట్టాలను తొలగించారు. ఈ ఘటనతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్భంది మరమ్మత్తు పనులు చేపట్టారు.
News Posted: 13 June, 2009
|