విశాఖపట్నం : చిట్టివలస జూట్ మిల్ లాకౌట్ కు నిరసనగా కార్మికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ ను నిలిపివేసి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కార్మికుల ఆందోళనకు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ ఘటనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.