బ్రిడ్జిని పేల్చిన మావోలు
విజయనగరం : జిల్లాలోమావోయిస్టుల విధ్వంసం కొనసాగుతోంది. నారాయణపట్నం లక్ష్మిపురం రోడ్డులోని సాలూరు వద్ద మావోయిస్టులు గురువారం బ్రిడ్జిని పేల్చివేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గతరాత్రి పసనభధ్రలోని ఐదు ఇళ్ళలో ఏకకాలంలో మావోలు లూటీకి పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారం, నగదును దోచుకెళ్ళారు.
News Posted: 18 June, 2009
|