విశాఖపట్నం : వాహనాల రిజిస్ట్రేషన్ కు `పాన్ కార్డ్' తప్పనిసరి అన్న నిబంధన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. ఇప్పటికే ఈ విధానం కొన్ని నగరాల్లో అమలవుతుంది. కాగా త్వరలో అన్ని జిల్లాల్లో `పాన్' కార్డు విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే రకరకాల జీవోలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు మరో కొత్త విధానానికి సన్నద్ధం కావాల్సి ఉంది. ఇప్పటికే త్రీ టైర్ విధానం అమల్లో ఉన్న రవాణా కార్యాలయాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లకు తప్పని సరిగా పాన్ కార్డు ఉండాలన్న నిబంధన ఉంది. ఇటీవల రవాణా శాఖకు ఆదాయ పన్ను శాఖతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాహనదాలుల ఆదాయంపై పూర్తి దృష్టి సారించేందుకు ఆదాయ శాఖతో లింక్ పెట్టింది. ఇప్పటి వరకు రెండవ వాహనం కొంటే 12 శాతం పన్ను కట్టించుకునే ప్రభుత్వం సరికొత్త విధానానికి నాంది పలకనుంది.