బంగారు దుకాణాలు బంద్
విశాఖపట్నం : విశాఖ నగరంలో బంగారు దుకాణాల యజమానులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. వెంకట కళ్యాణ్ జూవెలర్స్ యజమాని సూర్యప్రకాష్ మృతికి పోలీసుల అమానుష చర్యలే కారణమని ఆరోపిస్తూ వారు మూడు రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి వృతికి కారణమైన పలాస జీఆర్పీ ఎస్ ఐ అన్వర్ ను తక్షణం అరెస్టు చేయాలని, వ్యాపారి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఆ తరువాత నగర పోలీస్ కమిషనర్ సాంబశివరావును కలిసి పరిస్థితిని వివరించారు. తమకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సూర్యప్రకాశ్ దొంగ బంగారం అమ్ముతున్నారంటూ ఇన్ ఫర్మేషన్ వచ్చిందని చెబుతూ పోలీసులు ఆయనను జీపులో తీసుకువెళుతుండగా గుండెపోటుతో మృతి చెందిన చెందిన విషయం విదితమే.
News Posted: 24 June, 2009
|