జాలర్లు క్షేమం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో గల్లంతు అయిన మత్స్యకారులు క్షేమంగా మరో గంటలో తీరాన్ని చేరుకోనున్నారు. వజ్రపుకొత్తూరు మండలం, దేవునల్తాడ సముద్రతీర ప్రాంతంలో గురువారం చేపల వేటకు వెల్ళిన జాలర్లు గల్లంతు కావడంతో సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన కోస్టు గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు సహాయపడుతున్నట్లు నౌపాడ ఎస్సై మూర్తి చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 25 June, 2009
|