విశాఖపట్నం : పెంచిన స్కూల్ ఫీజును యాజమాన్యం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లితండ్రులు విశాఖపట్నంలోని టింఫనీ స్కూల్ శుక్రవారం దాడి చేశారు. పాఠశాల గేటు తాళాలను పగులగొట్టి ఆందోళన కారులు లోనికి దూసుకువెళ్ళి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.