అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
విశాఖపట్నం : అప్పుల బాధను తట్టుకోలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి మండలం, ఉద్దండపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు తాగిన భార్యా, భర్త, కుమార్తె ముగ్గురూ మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 30 June, 2009
|