విశాఖపట్నం : గాజువాకలోని భాష్యం స్కూల్లో చదువుకుంటున్న పవన్ అనే విద్యార్థిని అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు పవన్ తండ్రికి ఫోన్ చేసి పది లక్షలు ఇస్తే మీ పిల్లవాడిని వదిలేస్తామని ఫోన్ చేయడంతో ఆందోళనతో తల్లితండ్రులు స్కూల్ కు వెళ్ళి విచారించారు. పాఠశాలకు వెళ్ళిన తన కుమారుడు అక్కడ కూడా లేకపోవడంతో కంగారుపడిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.