మన్యం వీరుడికి నివాళులు
విశాఖపట్నం : భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని గడగడలాడించిన మన్యం వీరుడు, తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా అంటూ సాయుధ పోరాటం స్వాతంత్ర్యం ఉద్యమంలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విశాఖలో ఆయనకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరికి విశాఖ మన్యంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
News Posted: 4 July, 2009
|