విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుణుడు కరుణ చూపనున్నాడని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాగల 24 గంటల్లో కోస్తా అంతా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వివరించింది. గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News Posted: 6 July, 2009
|