డిపో అధికారులపై విద్యార్థుల దాడి
విశాఖపట్నం : బస్ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు డిపో అధికారులను నిర్భందించారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ డిపోపై బుధవారం విద్యార్థులు దాడి చేశారు. బస్ పాస్ లు ఇవ్వడం లేదన్న కోపంతో విద్యార్థులు ఫర్నిచర్ ధ్వంసం చేసి, అధికారులను నిర్భందించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
News Posted: 8 July, 2009
|