ఉక్కు కార్మికుల ఆందోళన
విశాఖపట్నం : పబ్లిక్ భాగస్వామ్యాన్ని నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు ప్లాంట్ గేట్ వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. ప్లాంట్ విస్తరణకు నిధులు సేకరించడంలో భాగంగా పరిశ్రమలో 25 శాతం పబ్లిక్ భాగస్వామ్యంలో పెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర వ్యతిరేకతను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ భాగస్వామ్యం వల్ల పరిశ్రమకు గానీ, కార్మికులకు గానీ కలిగే లాభనష్టాలను వివరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
News Posted: 9 July, 2009
|