చౌరాసియాకు జాతీయ పురస్కారం
విశాఖపట్నం : ప్రముఖ వేణుగాన విద్వాంసులు పద్మభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియాకు ఆగస్టు 12న `నాద విద్యాభారతి' బిరుదును ప్రధానం చేయనున్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఈ సంవత్సరం జాతీయ పురస్కారానికి చౌరాసియాను ఎంపిక చేసింది. విశాఖ జిల్లా కళాభారతి ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు అధ్యక్షుడు సీఎస్ ఎస్ రాజు తెలిపారు. ఆయనకు ఈ బిరుదుతో పాటు లక్షరూపాయల నగదు, స్వర్ణకమలం ప్రదానం చేయనున్నారు.
News Posted: 10 July, 2009
|