శ్రీకాకుళం: ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని బందుగావ్ సమీపంలో వరద నీటిలో ముగ్గురు టీచర్లు గల్లంతయ్యారు. విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. గల్లంతయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం వరద నీటిలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.