శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంశధారకు వరద నీరు అధికంగా తరలిరావడంతో ఎల్ ఎన్ పేట వద్ద సుమమంతపురం కుడి కాలువకు సోమవారం గండి పడింది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు పంటచేలల్లోకి రావడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న అధికారులు గండిపడిన ప్రదేశానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.