శ్రీకాకుళం : జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో రోగికి వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రోగి బంధువులు వైద్యులపై దాడి చేశారు. అడ్డు పడిన ఆర్ ఎం ఓ పై కూడా వారు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.