చీఫ్ అడ్మిరల్‌కు ఘనంగా వీడ్కోలు విశాఖపట్నం : భారత నౌకాదళానికి 42 ఏళ్లపాటు సేవలందించి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతాకు ఈ రోజు తూర్పు నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికింది. తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధాన కేంద్రం ఐఎన్ ఎన్ సర్కార్స్‌లో సిబ్బంది పరేడ్ నిర్వహించారు. 24 నౌకాదళ ఫ్లటూన్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. యుద్ధనౌక ఐఎన్ ఎస్ రణ విజయ్ కు చెందిన అధికారులు, వివిధ భాగాల ప్రధాన అధికారులు సురేష్ మెహతాకు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అడ్మిరల్ మెహతా మాట్లాడుతూ మన నౌకాదళం కీలకశక్తిగా ఎదిగిందని, చాలా దేశాలు మన నుంచి సహకారాన్ని ఆశిస్తున్నాయని అన్నారు. ఈయన స్థానంలో వైస్ అడ్మిరల్ నిర్మల్ వర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు.
News Posted: 13 August, 2009
|