నిరుద్యోగులకు ఐపాడ్ శిక్షణ విశాఖపట్నం : వర్షాభావం నేపథ్యంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎల పరిధిలోని గిరిజన నిరుద్యోగులకు ఐపాడ్ ద్వారా వివిధ వృత్తుల్లో శిక్షణను ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పరిశ్రమలు, పశువుల పెంపకం, వ్యవసాయం, చేతివృత్తులు వంటి వాటిలో శిక్షణ ఉంటుందన్నారు. కేవలం ట్యాంకులు నిర్మించి నీటి సదుపాయం కల్పించకుండా వృధాగా వదిలేసిన 22 నీటి పథకాలను వినియోగంలోకి తేవడానికి 85 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేశామన్నారు. అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.
News Posted: 24 August, 2009
|