విజయనగరం : అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ట్రాన్స్ కో ఏఈ పోలయ్య పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. ఓ పని నిమిత్తం ఏఈ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న ఏఈని పట్టుకున్నారు.