కూటమికి సీట్ల తంటా!
హైదరాబాద్: సీట్ల సర్దుబాటు విషయంలో మహా కూటమి నానా తంటాలు పడుతోంది. దీనిపై పలుమార్లు చర్చోపచర్చలు జరిగినా ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరడం లేదు. మహా కూటమి నాయ కులు పలుమార్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసి సీట్ల సర్దుబాట్ల విషయంపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయినా గాని అవి ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి హరీష్‌రావు, సిపిఐ జాతీయ కార్యదర్శి ఎంపి సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఎం నాయకులు విడివిడిగా బాబును కలిసి మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగం గానే వారు అసెంబ్లీలో బాబును ఆయన ఛాంబర్‌లో విడి విడిగా కలిశారు. ఏయే నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలనే దానిపై వారు చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే 45 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయడానికి టిడిపి, టిఆర్‌ఎస్ ఒక అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే .
అయితే వీరు ఏయే నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనే దానిపైనే ఒక అంగీకారం కుదరడం లేదని, అందువల్లే అవకాశం చిక్కినప్పుడల్లా బాబుతో మాట్లాడడానికి మహాకూటమిలోని మూడు పార్టీల నాయకులు పోటీలు పడుతున్నారు. లోపాయికారిగా సీట్ల సంఖ్య కుదిరినప్పటికీ, ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిమీద మాత్రం ఏ మాత్రం పొత్తు పొసగడం లేదని ఆ పార్టీలో కొందరు నాయకులు భావిస్తున్నారు. ఎవరికి ఎక్కడ బలం ఉంటుందో, గత ఎన్నికలలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో బేరీజు వేసు కుని దాని ప్రకారం సీట్లు సర్దుబాట్లు చేయాలని టిడిపి భావిస్తుంది. అయితే గత ఎన్నికలలో ఓట్ల శాతాన్ని కూట మిలోని ఇతర పార్టీల నాయకుల ముందు పెట్టి, ఆ విధంగా సీట్లు కట్టబెట్టాలని చూస్తో్తంది.
Pages: 1 -2- News Posted: 10 February, 2009
|