కూటమికి సీట్ల తంటా!
ఇదే క్రమంలో సిపిఎం కూడ తనకు ఎన్ని సీట్లు ఇస్తారో అనే ఆయోమయంలో పడింది. లెఫ్ట్ పార్టీలకు మొ త్తం కలిపి 40 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే రెండు లెఫ్ట్ పార్టీలకు కలిపి 33 అసెంబ్లీ సీట్లు కంటే ఎక్కువ ఇవ్వకూడదని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆ రెండు పార్టీలకు కలిపి నాలుగు పార్లమెంట్ స్థానాలు కూడా ఇచ్చే ఆలోచనలో టిడిపి ఉన్నప్పటికీ, ఈ విషయంలో వామపక్షాలు మాత్రం రాజీ పడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాట్లు జరుగుతాయని మహాకూటమి నేతలు చెప్పారు. నాలుగు పార్టీలు కలిపి ఉమ్మడిగా నిర్వహించే మహాసభలో సీట్ల సర్దుబాట్లు గురించి వెల్లడిస్తామని టిఆర్‌ఎస్ నాయకుడు హరీష్‌రావు తెలిపారు. ఈ నెలా ఖరులో మహా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగు తున్నాయని, అన్ని విషయాలు అక్కడే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
టిడిపి, సిపిఐలు తెలంగాణకు సానుకూలంగా ఉన్నప్పటికీ సిపిఎం మాత్రం తన అభిప్రాయాన్ని అర్థం కాకుండా చెప్పుకు వస్తోంది. తెలంగాణకు మేము వ్యతిరే కం అంటూనే... ఇస్తానంటే అడ్డుకుంటామా అంటూ తన ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. దీంతో టిఆర్‌ఎస్ పార్టీపై కొంత ఓత్తిడి పెరుగుతోంది. ఈ విషయంలో పునరా లోచించాల్సిన అవసరం ఏర్పడిందని టీడీపీ భావిస్తుంది. ఎందుకంటే సిపిఎం వైఖరి వల్ల టిఆర్‌ఎస్ మహాకూట మితో కలిసి పని చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా టిడిపి నాయకులు బహిర్గతం చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 10 February, 2009
|