బిజెపిలో ఇక సేనాపతులు!
ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని వికేంద్రీకరించాలనే ప్రతిపాదన రావడానికి మరొక కారణం కూడా ఉంది. తన అనుచరులందరినీ అద్వానీ సమంగా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేయదలచుకోని జైట్లీ ఎన్నికల ప్రచారం బాధ్యతలను పూర్తిగా వహించాలని కోరుకుంటున్నారు. కాని అద్వానీ ఆ బాధ్యతలను అందరికీ సమంగా పంచారు. జైట్లీని బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ బాధ్యతలను అప్పగించగా ఎన్నికలలో పోటీ చేస్తున్న సుష్మా స్వరాజ్ కు మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ బాధ్యతలు లభించాయి. అయితే, జైట్లీ మీడియా వ్యవహారాలు చూస్తారు.
ఎన్నికలలో పోటీ చేయకుండా ఢిల్లీ నుంచి ఎన్నికలను పర్యవేక్షించాలని కోరుకున్న వెంకయ్య నాయుడు ప్రాధాన్యాన్ని కూడా అద్వానీ తగ్గించారు. అయితే, సంస్థాగత కార్యక్రమాల నిర్వహణలో వెంకయ్య సామర్థ్యాన్ని అద్వానీ పొగిడారు. దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను వహించవలసిందిగా వెంకయ్యను ఆయన కోరారు. దక్షిణాది రాష్ట్రాలు అని సూచించినా ఆయన బాధ్యతలు చాలావరకు కర్నాటకకే పరిమితం అవుతాయి. ఢిల్లీ నుంచి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్న అనంత కుమార్ ను కర్నాటకకు పరిమితం చేశారు.
Pages: -1- -2- 3 News Posted: 10 February, 2009
|