బిజెపిలో ఇక సేనాపతులు!
అంతే కాకుండా అటల్ బిహారి వాజ్ పేయికి గల ఆకర్షణ శక్తి అద్వానీకి లోపిస్తున్నది. వాజ్ పేయి ఆకర్షణ శక్తి బిజెపి పట్ల ఆదరణను పెంచింది. దీనితో పార్టీ ఎన్నికల ప్రచారాలు ఆయననే కేంద్రం చేసుకుని సాగాయి. 'అబ్ కీ బారి అటల్ బిహారి' (ఇప్పుడు అటల్ బిహారి వంతు) వంటి నినాదాలను పార్టీ ప్రచారంలోకి తీసుకువచ్చింది. అందువల్ల, నాగపూర్ లో అద్వానీయే స్వయంగా బిజెపి ముఖ్యమంత్రులు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకుల గురించి మాట్లాడారు. పార్టీ ప్రతినిధులు ఈ విధానాన్ని బహుదా కొనియాడారు. వ్యక్తి ఆరాధనను ఇష్టపడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు నాగపూర్ ప్రధాన కేంద్రం కదా.
రామ మందిరం గురించిన ప్రకటనతో ఈ సమ్మేళనంలో అలజడి సృష్టించిన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కూడా అద్వానీ నుంచి తన ప్రతిపాదనకు మద్దతు పొందారు. రామమందిరాన్ని బిజెపి వదలిపెట్ట జాలదని అద్వానీ కూడా అన్నారు. కాగా అద్వానీ కేవలం ఒక్క ముఖ్యమంత్రినే కాకుండా తదుపరి తరం నాయకులందరినీ ప్రశంసించడం రాజ్ నాథ్ ను కూడా ఆనందింపచేస్తుంది. తిరుగులేని అధికార కేంద్రంగా మోడి ఆవిర్భవించరాదని రాజ్ నాథ్ కోరుకుంటున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 10 February, 2009
|