హైడెఫినిషన్ టివి ప్రసారాలు
అయితే, ఈ ఉత్తమ నాణ్యత కావాలంటే అందుకు కొంత ఖర్చు చేయక తప్పదు. టెలివిజన్ హెచ్ డిటివి ప్రసారాలకు అనువైనదై ఉండాలి. 'కొన్ని టివిలు ఇప్పుడు హెచ్ డి సౌకర్యంతో ఉన్నాయి' అని డిడి ఇంజనీర్-ఇన్ చీఫ్ ఆర్.ఆర్. ప్రసాద్ సూచించారు. ఆయనే ఈ ప్రాజెక్టుకు అధిపతి. సెట్ టాప్ బాక్స్ సాయంతో ఇతర టివి సెట్లకు హెచ్ డి సౌకర్యం కల్పించవచ్చునని ఆయన సూచించారు. అయితే, డిడికి గల 1400 ట్రాన్స్ మిటర్లలో అధిక సంఖ్యాకం ఇప్పటికీ ఏంటెన్నా అవసరమైన అనలాగ్ పద్ధతిని కలిగి ఉన్నాయి. అందువల్ల అధిక సంఖ్యాక డిడి వీక్షకులకు హెచ్ డిటివి ప్రసారాలు అందుబాటులో ఉండవు. తన వ్యవస్థను డిజిటలైజ్ చేసుకోవడానికి డిడి రూ. 430 కోట్లు ప్రత్యేకించింది.
స్టూడియోల ఏర్పాటు నిమిత్తం రూ. 170 కోట్లు సమకూర్చవలసిందిగా డిడి మంత్రిత్వశాఖను కోరింది. దీని వల్ల బీజింగ్ ఒలింపిక్స్ ప్రసారాలకు సమాన స్థాయిలో లేదా దాని కంటె మెరుగ్గా ప్రసారాలను చేయవచ్చునని డిడి సూచించింది. 'ప్రపంచంలో అత్యుత్తమమైన ప్రసారాల క్వాలిటీతో సరిపోల్చదగిన రీతిలో అత్యున్నత క్వాలిటీ ప్రసారాల వ్యవస్థ ఏర్పాటుకై అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడల కన్సల్టెంట్లను మేము సమకూర్చుకుంటున్నాం' అని ప్రసార భారతి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.ఎస్.లల్లీ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 11 February, 2009
|