టివి యాడ్స్ తో హోరాహోరీ!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పొందడానికి బరాక్ ఒబామా లక్ష పైచిలుకు టివి ప్రకటనలపై 60 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసి రికార్డులు సృష్టించిన తరువాత మన దేశంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అదే మార్గాన్ని అనుసరించబోతున్నాయి. దేశంలో అతి పెద్ద ప్రకటనల యుద్ధం త్వరలో ప్రారంభం కానున్నది. రికార్డు స్థాయిలో వ్యయభరితమైన ప్రకటనలతో కూడిన ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ఆ రెండు జాతీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.
అయితే, అమెరికాలో మాదిరిగా భారతీయ ఎన్నికల చట్టాల కింద ఒక డిక్లరేషన్ దాఖలు చేయడం తప్పనిసరి కానందున ప్రకటనల వ్యయాలపై రాజకీయ పార్టీలు ఎన్ని వందల కోట్లు వెచ్చించబోతున్నాయో విస్పష్టంగా తెలుసుకోవడం కొంచె కష్టమే. ఈ పర్యాయం కూడా ఏ పార్టీ కూడా ఆ గణాంకాల గురించి మాట్లాడేందుకు సుముఖంగా లేవు. కాని రాజకీయ వర్గాల అంచనా ప్రకారం, ఆ రెండింటి ప్రచారం వ్యయం రూ. 150 కోట్లు, రూ. 500 కోట్ల మధ్య ఉండవచ్చు. కార్పొరేట్ ప్రకటనల బడ్జెట్లలో భారీ కోతల ప్రభావానికి గురై ఇబ్బందులు పడుతున్న ప్రకటనల సంస్థలకు అనూహ్యంగా లాభాలు రానున్నాయి.
ఆ పార్టీల ప్రకటనల కాంట్రాక్టులను కైవసం చేసుకోవడానికి దాదాపు అన్ని పెద్ద ప్రకటనల సంస్థలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్రేయాన్స్, జె వాల్టర్ థాంప్సన్ సంస్థలను ఎంపిక చేసుకోవచ్చు. ఇటీవలి కొన్ని రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రచారం బాధ్యతను క్రేయాన్స్ నిర్వహించింది.
Pages: 1 -2- News Posted: 16 February, 2009
|