టివి యాడ్స్ తో హోరాహోరీ!
ఇక బిజెపి గ్రే, పర్సెప్ట్, ఐరిస్, యూరో ఆర్ఎస్ సిజి, గ్రాఫిక్స్ ఏడ్ వంటి సంస్థల రూపొందించిన నమూనా ప్రకటనలను పరిశీలించింది.1999, 2004 ఎన్నికల ప్రచారం సమయంలో బిజెపి కోసం గ్రే సంస్థ ప్రకటనలను సిద్ధం చేసింది. ఆ సంస్థల ప్రతిపాదనలను, శైలి, ప్రజాకర్షణ స్థాయిలను మదింపు వేసిన తరువాత 'అతి త్వరలోనే' తమ పార్టీ ఒక నిర్ణయం తీసుకోగలదని బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
ఏవిధంగా ప్రచారం నిర్వహించాలో పార్టీలు నిశ్చయించుకున్నందున 'బ్రాండ్ రాహుల్', 'బ్రాండ్ అద్వానీ' మధ్య పోటీ అన్నట్లుగా ప్రకటనల పోరు ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ నెల 5 నుంచి దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో రాహుల్ చిత్రాలను ప్రధానంగా ప్రదర్శిస్తూ హోర్డంగ్ లు, పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేసింది. వాటిలో కొన్నిటిలో రాహుల్ ఒక్కడే ఉండగా, మరికొన్నిటిలో ఆయన తన తల్లి సోనియా గాంధితో కలసి ఉన్న చిత్రాలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో నామమాత్రంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రాలను పొందుపరిచారు.
ఎన్నికలకు ముందుగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐదు హోర్డింగ్ లు, పది వేల పోస్టర్లు, పది వేల బ్యానర్లను ఏర్పాటు చేయాలని తమ పార్టీ సంకల్పిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలియజేశారు. దేశంలో సుమారు నాలుగు వేల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నందున వీటి ఖర్చు భారీ స్థాయిలోనే ఉంటుంది. మరొక వైపు బిజెపి 'బ్రాండ్ అద్వానీ' ప్రచారాన్ని గూగుల్ ద్వారా సైబర్ స్పేస్ లో ప్రారంభించింది. ఈ రోజుల్లో అద్వానీ ప్రకటన లేకుండా ఏ వెబ్ సైటూ కనిపించదు.
Pages: -1- 2 News Posted: 16 February, 2009
|