తెలుగు సినిమా వసంతం
ఆస్టిన్ తెలుగు కార్యక్రమం భాషకే పరిమితం కాకుండా, ఈ తరం తెలుగు విద్యార్ధులలో సంస్కృతి పట్ల అభిరుచి పెంచడానికి దోహద పడుతోందని ‘తానా’ కార్యదర్శి, ఆస్టిన్ తెలుగు కార్యక్రమ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రసాద్ తోటకూర చెప్పారు. తెలుగును ఒక భాషగానే కాకుండా ఒక సాంస్కృతిక రంగంగా భావించి, ఆ భాషను అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉదని వివరిస్తూ తెలుగు విద్యార్ధి బ్రైస్ రాబిన్సన్ ఆసక్తికరమయిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.
ఆస్టిన్ – టెక్సస్ తెలుగు విద్యార్ధుల సమాఖ్య అధ్యక్షురాలు దీపికా ముత్యాల, ఉపాధ్యక్షురాలు దివ్య యలమంచిలి తెలుగు సమాఖ్య కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సమాఖ్యలో అనుపమ అట్లూరు, ప్రియా కుమార్ ఎలిజబెత్, రంజనీ దావలాత్, హర్ష ఓరుగంటి, నవీన్ చల్లపల్లి, బ్రైస్ రాబిన్సన్, మనోజ్ మిక్కిలినేని కార్యవర్గ సభ్యులు. ప్రసాద్ తోటకూర, కోనేరు ఆంజనేయులు, ముత్యాల పద్మశ్రీ, వై.వి. రావు, ఎస్.ఎస్. రావు, అనంత్ బొబ్బిలి, మాధవరావు గోవిందరాజు, డాక్టర్ అఫ్సర్, రామ్ యలమంచిలి గౌరవ సలహాదారులు. శుక్రవారం జరిగిన తెలుగు సినిమా వసంతం వేడుకల్లో వీరంతా పాల్గొనడం కార్యక్రమానికి కొత్త శోభనిచ్చింది. వారితో పాటు రాంకీ చేబ్రోలు, మురళి వెన్నం, పులిగండ్ల విశ్వనాధం, సి.ఆర్. రావు, ఎ. మురళి, రాజా ముత్యాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|