అమర్ సింగ్ చేతికి 'షాట్ గన్'?
పాట్నాలో కేన్సర్ రోగుల ప్రత్యామ్నాయ చికిత్స కేంద్రం, పొగాకు వ్యతిరేక సమావేశం ప్రారంభ కార్యక్రమంలో అమర్ సింగ్ ప్రసంగిస్తూ శత్రుఘ్న సిన్హాను గాలిలోకి ఎత్తివేస్తూ ఎంతగానో ప్రశంసించారు. 'మతతత్వ బిజెపి జన సమూహంలో ప్రత్యేకత' కల నాయకునిగా శత్రుఘ్న సిన్హాను అమర్ పేర్కొన్నారు. 'శత్రూజీ సాధువు, బాలుని లక్షణాలు కలబోసినవాడు, ఏ పార్టీ విధానానికీ ఆయన అతీతుడు' అని అమర్ వ్యాఖ్యానించారు.
శత్రుఘ్న సిన్హా ఇందుకు స్పందిస్తూ, ఆరోగ్య విషయాలలో రాజకీయాలకు తావు లేదని, మంచి పనులకు పార్టీ అనుబంధాలతో నిమిత్తం లేదని అన్నారు. 'నేను ఈ సభకు హాజరైన కారణంగా మా నాయకుడు ఎల్.కె. అద్వానీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా అమర్ సింగ్ సంయమనం పాటించారు' అని అన్నారు. అయితే, రాజకీయ ప్రత్యర్థి అమర్ సింగ్ తో కలసి శత్రుఘ్న సిన్హా వేదిక పంచుకోవడం పట్ల బిజెపి నాయకులు ఆశ్చర్యపోలేదు. 'బిజెపి కార్యకర్తలు పరిణతి చెందినవారు. అటువంటి ఎత్తుగడలు, బ్లాక్ మెయిలింగ్ లతో వారిని వంచించలేరు. అటువంటి సమావేశం కాబోయే అభ్యర్థి అవకాశాలను మాత్రమే దెబ్బ తీయగలదు' అని బిజెపి సీనియర్ నాయకుడు, పాట్నా సాహెబ్ స్థానానికి మూడవ అభ్యర్థి ఆర్.కె. సిన్హా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం గురించి ప్రశ్నించినప్పుడు శత్రుఘ్న సిన్హా సమాధానం ఇస్తూ, 'ఈ సమావేశానికి రాజకీయ అర్థం వెతకడానికి ప్రయత్నించరాదు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ కేన్సర్ రోగుల సంక్షేమం కోసం కృషి చేశారు. నాకు కూడా ఈ సంక్షేమ కార్యక్రమంతో సంబంధం ఉంది. అందుకే ఈ సమావేశానికి నేను హాజరయ్యాను' అని చెప్పారు. బిజెపి అధికార ప్రతినిధి కిరణ్ ఘై మాట్లాడుతూ, 'శత్రుఘ్న సిన్హా, సంజయ్ దత్ చాలా కాలంగా స్నేహితులు' అని తెలియజేశారు. మరి పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే కల్యాణ్ సింగ్ వలె శత్రుఘ్న సిన్హా వ్యవహరిస్తారా అని ప్రశ్నించినప్పుడు 'ఆయన అలా చేయరనే ఆశిద్దాం' అని కిరణ్ ఘై సమాధానం ఇచ్చారు.
Pages: -1- 2 News Posted: 20 February, 2009
|