రేసులో కాంగీ'పెద్ద'లు
తమ పదవీ కాలం ఒక సంవత్సరం మిగిలి వున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులే లోక్ సభ ెన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లు గట్టిగా కోరుతున్నారు. రాజ్యసభ సభ్యులుగా కొనసాగితే, సంవత్సరం తరువాత పదవీ కాలం పూర్తయ్యాక తమను మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేస్తారా అన్నది వారి సందేహం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది వారి ఆలోచన. అందుకే లోక్ సభ ఎన్నికల బరిలో దిగుదామనుకుంటున్నారట. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వారి విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదని అనుకుంటోందని సమాచారం.
రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులను సమీక్షించుకున్న తరువాత లోక్ సభ టిక్కెట్లు ఆశిస్తున్న రాజ్యసభ సభ్యుల విషయం ఆలోచించాలని ప్రస్తుతానికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయించింది. ముందుగా, వారిని బరిలో దించాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని, ఆ తరువాతనే విజయావకాశాలు అధికంగా ఉన్నవారి అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కొందరు సీనియర్ నాయకులు అధిష్టానానికి సలహా ఇచ్చారట.
Pages: -1- 2 News Posted: 24 February, 2009
|