ఉచిత మద్యం కూపన్లు
హైదరాబాద్ : రోజంతా 'పని' చేసి చేసి అలసిపోయిన అనంతరం ఒక యువకుడు పాత బస్తీలో ఒక మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. ఇతరులు డబ్బు ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తుంటే ఈ యువకుడు మాత్రం కౌంటర్ లో ఉన్న వ్యక్తికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు.
'ఇస్కో దో ఫుల్ బాటిల్ దే దో' (ఇతనికి రెండు ఫుల్ బాటిల్స్ ఇవ్వు) అని షాపు యజమాని అరిచారు. ఆ మరుక్షణమే రెండు మద్యం సీసాలతో చిద్విలాసంగా షాపులో నుంచి బయటకు వెళ్ళిపోగా అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు ఆ కాగితం ఏమై ఉంటుందా అనుకుంటూ దిగ్భ్రాంతిగా అతని వైపే చూస్తుండిపోయారు.
ఈ రోజుల్లో ఆ చీటీయే 'సర్వస్వం'. ఎవరో ముఖ్యమైన నాయకుని సంతకం ఉన్న ఆ చీటిలో దానిని తీసుకువచ్చిన వ్యక్తికి ఎన్ని సీసాలు ఇవ్వాలో రాసి ఉంటుంది. వోటర్లకు నేరుగా మద్యం సీసాలు, ప్యాకెట్లు ఇచ్చే బదులు రాజకీయ పార్టీలు ఈ విధంగా వారిని ప్రలోభపెట్టుతున్నాయి. భారీ అమ్మకాల కోసం మద్యం దుకాణాలపై నిఘా వేసిని అనేక మంది పోలీసు సిబ్బంది వేలాది మంది యువకులు చీటీలు చేతబట్టుకుని తిరుగుతుండడం గమనించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చీకటి పడిన వెంటనే వందలాది మంది యువకులు తమ 'కోటా' మద్యం సీసాలు తీసుకోవడానిక చీటిలతో నగరంలోని వివిధ మద్యం దుకాణాలకు చేరుకుంటున్నారని పోలీసు వర్గాలు 'ఎక్స్ ప్రెస్' విలేఖరితో చెప్పాయి.
Pages: 1 -2- News Posted: 12 April, 2009
|