చిరు పార్టీలో బాబు భయం
ప్రజారాజ్యం పార్టీ వల్లనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఈ పార్టీ చీల్చుకుందని, 17 శాతం ఓట్ల మేర ఈపార్టీకి ఓట్లు రావడం వల్ల టిడిపి పరాజయం పాలైందని టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల ముగిసిన రెండు రోజుల మహానాడులో ప్రకటించిన విషయం విదితమే. టిడిపికి తాజా ఎన్నికల్లో 26 శాతం ఓట్లు పోలయ్యాయి. టిడిపికి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం బలంగా ఉంది. అన్ని జిల్లాల్లో తిరుగులేని యంత్రాంగం ఉంది. మొన్నటి ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రజారాజ్యం పార్టీని విచ్ఛిన్నం చేయక తప్పదనే కృత నిశ్చయంతో బాబు ఉన్నారు. ప్రజారాజ్యం చురుకుగా ఉన్నతం కాలం వ్యతిరేక ఓటు గణనీయంగా చీలిపోయి, ముక్కోణపుపోటీలో కాంగ్రెస్ లాభపడుతుందని ఆయన వాదన.
తెలుగుదేశం పార్టీ నుంచి తమ గూటికి వచ్చిన ముఖ్యనేతలే కాకుండా, కింది స్థాయి నేతలు, కార్యకర్తలు మళ్ళీ ఆ పార్టీవైపు వెళ్ళకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలైన వెంటనే జిల్లా పర్యటనలు చేపట్టాలని చిరంజీవి నిర్ణయించారు. పార్టీ శ్రేణులను కలిసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారు. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం చేపట్టి ముఖ్యమైన నేతలందరికీ కీలక బాధ్యతలు అప్పగించి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జూన్ 3వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను ప్రముఖంగా ప్రస్తావించాలని సమావేశం నిర్ణయించింది.
Pages: -1- 2 News Posted: 1 June, 2009
|