సిబ్బందికి వైఎస్ మంత్రం
ఉదయం ముఖ్యమంత్రి సచివాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆయన వాహనశ్రేణిని మైసమ్మ గుడి వద్ద నిలిపివేశారు. అక్కడి నుంచి ఆయన సి బ్లాక్ ప్రధాన ఎంట్రన్స్ వరకు పరచిన ఎర్ర తివాచీపై నడవవలసి వచ్చింది. ఆ దారి పొడుగునా ఉద్యోగులు రాజశేఖరరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఆయనపై పుష్పవర్షం కురిపించారు. తన చాంబర్స్ లోకి ప్రవేశించిన ఆయనకు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు, పాస్టర్, మౌల్వీ ఆశీర్వచనాలు పలికారు.
'నేను ఎంతో వినమ్రంగా రెండవ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నాకు మాటలే రావడం లేదు. ఇక నా కల ఏమిటంటే సత్పరిపాలనకు, పకడ్బందీగా పథకాల ఫలితాల బట్వాడా వ్యవస్థకు ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దడం' అని డాక్టర్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.
తరువాత సాయంత్రం సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ రాజశేఖరరెడ్డి గృహ నిర్మాణం కోసం అదనపు స్థలాన్ని కేటాయించగలమని వారికి హామీ ఇచ్చారు. వారి ఇతర కోర్కెలను పరిశీలించగలమని కూడా ఆయన వాగ్దానం చేశారు. కాగా, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రమాకాంతరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Pages: -1- 2 News Posted: 4 June, 2009
|