మీరాకు కోపం వస్తుంది
స్వర్గీయ దళిత నాయకుడు జగ్జీవన్ రాము కుమార్తె అయిన మీరా ఇంకా మాట్లాడుతూ, ఈ పదవికి మహిళను ఎంపిక చేయడం ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదని అన్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని ఎన్నుకున్న రెండు సంవత్సరాల అనంతరం సభా నిర్వహణకు ఒక మహిళను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం మహిళా సాధికారత పట్ల దేశ దృఢ సంకల్పాన్ని సూచిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. 'మనం ఈ విషయంలో సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది. అయితే, మహిళలను పటిష్ఠమైన స్థితిలోకి తీసుకురావాలనే ఉద్దేశం మాత్రం ఉంది' అని ఆమె అన్నారు. 'మహిళా సాధికారత అనేది వట్టి నినాదం కాదు. ఆ దిశలో పటిష్ఠమైన చర్చలు తీసుకుంటున్నారు' అని మీరా చెప్పారు.
చివరకు మహిళా సాధికారతపై కూడా ఏకాభిప్రాయ సాధనే ప్రధానమని ఆమె నొక్కి చెప్పారు. ఆమె ఎన్నిక అనంతరం లోక్ సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇక మంచి రోజులు రావచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఏకాభిప్రాయం లేకుండా రాజ్యాంగాన్ని సవరించలేరని మీరా స్పష్టం చేశారు.
మహిళా ఎంపిలకు మాట్లాడేందుకు సరైన సమయం లభిస్తుందా అని ప్రశ్నించినప్పుడు, ఆడ మగ తేడా లేకుండా సభ్యులకు ఒకే విధంగా సమయం లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
సుమారు 300 మంది కొత్త ఎంపిలు 'యువజనులు' అని ఆమె పేర్కొంటూ, వృద్ధతరం ఎంపిలు వారికి మార్గదర్శనం చేయాలని, యువత ఆశయాకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
పని చేయనిదే వేతనం లేదు, పార్లమెంట్ లో పని గంటలు తగ్గిపోవడం, ఎంపిల జీతాలు వంటి వివాదాస్పద అంశాలపై నిర్దుష్టంగా ఏమాటా చెప్పకుండానే కొత్త స్పీకర్ పరిపక్వతను ప్రదర్శించారు. నేరస్థులు పార్లమెంట్ లోకి ప్రవేశించడం గురించిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, 'ప్రతి ఒక్కరూ నేరస్థులను పార్లమెంట్ లోకి రానివ్వరాదని కోరుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నది' అని చెప్పారు.
తనకు అత్యంత ఇష్టమైన రంగు గురించి ప్రశ్నకు 'నాకు ఆకుపచ్చ ఇష్టం. నేను హరిత మహిళను' అని మీరా సమాధానం ఇచ్చారు. ఇక తనకు చాలా ఇష్టమైన గ్రంథం కాళిదాస అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పారు. 'నేను దానిని పదే పదే చదువుతుంటాను' అని మీరా తెలిపారు.
Pages: -1- 2 News Posted: 4 June, 2009
|