పిఎంకు మహిళ రక్షణ
రాజస్థాన్ పోలీసులు పంజాబ్, హర్యానా పోలీసులతో కలసి ఉత్తర రాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారుల అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఆమె ఆ పోలీసుల బృందానికి సారథ్యం వహించారు. ఆ ప్రాంతంలో సరిహద్దులలో కార్యకలాపాలు సాగించే 20 మంది అగ్రశ్రేణి మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారుల జాబితాను రూపొందించిన మొదటి ఆఫీసర్ ఆమేనని చెబుతారు.
కరౌలిలో ఎస్ పిగా ఉన్నప్పుడు బినీతా ఠాకూర్ బందిపోట్లపై విరుచుకుపడ్డారు. ఐదు సంవత్సరాల క్రితం నీరు, ఇరిగేషన్ సౌకర్యాల కొరతపై వసుంధరా రాజె ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు సాగించిన ఆందోళనను అదుపు చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం జైపూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా ఉన్న బినీతా ఠాకూర్ పోలీస్ వృత్తి కాకుండా వేరే వ్యాసంగాలు కూడా ఉన్నాయి. ఆమె జూవాలజీలో పిహెచ్ డి చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రధాని ఇందిరా గాంధి హత్యానంతరం ఎస్ పిజి ఏర్పాటు జరిగింది. పోలీస్ శాఖ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోల నుంచి ఎంపిక చేసిన దాదాపు 3000 మంది సిబ్బంది ఎస్ పిజిలో ఉన్నారు. ఆఫీసర్ కేడర్ ప్రధానంగా ఐపిఎస్ ఆఫీసర్లతో కూడుకున్నది.
Pages: -1- 2 News Posted: 5 June, 2009
|