ఢిల్లీలోనే కేసీఆర్ మకాం
దిలీప్ కుమార్ తదితరులు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ విమోచన సమితి వైపు పార్టీ నుంచి ఎవరూ వెళ్ళకపోయినా కెసిఆర్ మౌనముద్ర ఎందుకు వీడటం లేదో సీనియర్ నేతలకు సైతం అర్థం కావటం లేదు. నాయకత్వ మార్పిడిని ప్రతిపాదించి సంచ లనం సృష్టించిన సీనియర్ నేత ఎ.చంద్రశేఖర్ కచ్చితంగా టివిఎస్ సమావేశానికి వెళ్తారని అంతా భావిస్తే ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు. మిగిలిన నేతలు కూడా ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాంటప్పుడు నలుగురినీ కలిపి కూర్చో బెట్టి మున్ముందు ఏమి చేయాలో చర్చించేందుకు కెసిఆర్‌కున్న అభ్యంతరం ఏమిటన్నది పార్టీ శ్రేణుల ప్రశ్న.
ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చి ఇప్పటికే 20 రోజులు గడచిపోయాయి. అన్నిపార్టీలూ ఫలితాలపై విశ్లేషణలు పూర్తి చేసుకుని లోటుపాట్లు సవరిం చుకునే దిశగాప్రయత్నాలు ప్రారంభిం చాయి. చివరకు కూటమిలోని మూడు పార్టీలు సైతం ఆ పని పూర్తి చేశాయి. టిఆర్‌ఎస్‌లో ఇప్పటిదాకా ఆ ప్రయత్నాలేవీ జరగలేదు.ఎక్కడెక్కడ ఏయే అభ్యర్థికి ఎన్ని వోట్లు వచ్చాయో లెక్కలు తెప్పించుకోవటం మినహా విశ్లేషణలు ప్రారంభమే కాలేదని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల విశ్లేషణకు కార్యవర్గాన్ని సమావేశపరు స్తానన్న మాట ఏమైందని ఆ వర్గాలు ప్రశ్నిస్తు న్నాయి. ఇప్పటికైనా కెసిఆర్ తన మౌనాన్ని వీడి పార్టీ పునర్నిర్మాణం పనులను ప్రారంభిస్తే కార్య కర్తల్లోనూ ఉత్సాహం వస్తుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో గ్రేటర్ హైదరా బాద్, మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు వరుసగా వస్తుండటంతో పార్టీని తిరిగి గాడిలో పడవేసేందుకు సాధ్యమైనంత త్వరగా చొర వ తీసుకుంటే బాగుంటుందని కొందరు నేతలు ఈ ప్రతినిధితోమాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 5 June, 2009
|