కార్లకు డే ఆఫ్?
'పది శాతం కారణంగా 90 శాతం జనాభా కాలుష్యంతో ఎందుకు ఇబ్బందులు పడాలి' అని జస్టిస్ నజ్కీ ప్రశ్నించారు. జనాభాలో పది, పదిహేను శాతం మంది మాత్రమే కార్లను లేదా ద్విచక్ర వాహనాలను వాడుతున్నారని పిటిషనర్ బొంబాయి ఎన్విరాన్ మెంటల్ ఏక్షన్ గ్రూప్ (బిఇఎజి) చేసిన వాదనను ప్రస్తావిస్తూ న్యాయమూర్తి ఈ ప్రశ్న వేశారు. ప్రైవేట్ వాహనాలపై 'ఆధారపడడాన్నితగ్గించేందుకు' ఏమి చేస్తున్నారని ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు నజ్కీ, వి.కె. తాహిల్ రమణిలతో కూడిన డివిజన్ బెంచ్ అంతకుముందు ప్రశ్నించింది.
కోర్టు ఆదేశాన్ని 'సరైన చర్య' గా పేర్కొన్న బిఇఎజికి చెందిన దేవీ గోయెంకా ప్రైవేట్ వాహనాలను వాడే '12 శాతం' ముంబైవాసులు '85 శాతం రోడ్డును' ఆక్రమిస్తున్నారని తెలియజేశారు. 'బెస్ట్ (బిఇఎస్ టి) బస్సులు సగటున గంటకు 12 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. రోడ్లపై నడిచే ప్రైవేట్ కార్ల సంఖ్యను తగ్గించినట్లయితే బస్సులు వేగంగా నడవగలవు... ముంబైలో టాక్సీల సమ్మెల సమయంలో 55 వేల టాక్సీలు రోడ్లపైకి రావు. అప్పుడు కాలుష్యం బాగా తగ్గిపోతుంది. బెస్ట్ బస్సులు మరింత వేగంతో నడవడానికి వీలు ఉంటున్నది' అని గోయెంకా పేర్కొన్నారు. నగర రోడ్లపై ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించేట్లుగా ఒత్తిడి తీసుకురావాలని పిటిషనర్ కోరుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలపై రోడ్ల రద్దీ కారక పన్నును విధించాలని కూడా లాల్ కమిటీ సూచించింది. లండన్ నగరం నడిబొడ్డుకు వచ్చే కార్ల నుంచి రోజూ రద్దీ కారక చార్జీని వసూలు చేసే విధానాన్ని లండన్ నగరంలో 2003 ప్రవేశపెట్టారని కమిటీ తెలియజేస్తూ, అదే తరహాలో ముంబైలో కూడా చార్జీ వసూలు చేయాలని సూచించింది. అయితే, ముంబై కార్పొరేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాది ఆ సూచనను వ్యతిరేకించారు. ముంబైకి ఐదు ఎంట్రీ కేంద్రాలు ఉన్నాయని, అటువంటి పన్ను వసూలు చేసేందుకు కార్పొరేషన్ వద్ద తగినంత మంది సిబ్బంది లేరని న్యాయవాది తెలియజేశారు.
కాగా, కార్ల నిషేధ దినం విధానాన్ని మొట్టమొదటిసారిగా నెదర్లాండ్స్, బెల్జియం 1950 దశకంలో సూయజ్ కాలువ సంక్షోభం సమయంలో ప్రవేశపెట్టాయి. 1956 నవంబర్ 25 నుంచి 1957 జనవరి 27 వరకు ఆదివారాలలో కార్లను నిషేధించారు.
Pages: -1- 2 News Posted: 11 June, 2009
|