ప్లాన్ తోనే వైఎస్ దాడి?
తెలంగాణలో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పరాజయం చెందడానికి కారణం నాయకుల తప్పిదాలే కారణం తప్ప తెలంగాణ వాదం కారణం కాదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ వాదం క్రమంగా బలహీనపడుతోందన్న విషయం ఉప ఎన్నిక్లలోనే వెల్లడైందని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బలంగా ఉన్న టిడిపి, టిఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టులుకలిసి పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కడాన్ని బట్టి తెలంగాణ వాదం మరింత బలహీనపడిందన్న విషయం స్పష్టమైందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు ఉన్నప్పటికీ అభివృద్ధి చేస్తే ఆదరిస్తారన్నది ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమైందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ లేదని చెప్పలేదని, తెలంగాణను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవడాన్ని, తెలంగాణ పేరుతో ఇతర ప్రాంతాల వారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని మాత్రమే తప్పుపట్టారని పిసిసి నాయకుడు ఒఖరు అభిప్రాయపడ్డారు.
అయితే కాంగ్రెస్ లోని కొందరు వెలిబుచ్చుతున్న అభిప్రాయం మరోలా ఉంది. అసమ్మతి కార్యకలాపాలతో తెరాస నాయకత్వం సంక్షోభంలో పడిందని, ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ వాదులందరూ ఒక్కటయ్యే అవకాశం ఉండవచ్చని వారు భావిస్తున్నారు. తెరాసలో కూడా అసంతృప్తితో ఉన్న నాయకులు తాజా పరిణామం వల్ల కెసిఆర్ కు అండగా నిలిచే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నికల అనంతరం బలహీన పడిన కెసిఆర్ బలపడేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే ఆదరించారు, వైఎస్ వాదనకు అధిష్ఠానం అండగా ఉంది, అందువల్ల తెలంగణ వాదులు ఏకమైనా చేయగలిగింది ఏమీ ఉండదు అని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్ అభిప్రాయంతో కోస్తా, రాయలసీమ ప్రజలు అంగీకరిస్తారని, ఈ ప్రాంతాల ప్రజలు వైఎస్ కు అండగా నిలుస్తారని ఆయన అన్నారు. `తెలంగాణలో కూడా వైఎస్ కు వ్యతిరేకత ఎక్కడుంది, వైఎస్ సమైక్య వాది అన్న విషయం ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అయినా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారంటే వైఎస్ అభిప్రాయంతో ఏకీభవించినట్టేనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.'
Pages: -1- 2 News Posted: 11 June, 2009
|