'ఆకలి' తీర్చని 'విందు'
హాలులోకి ముందుగా పొట్టి మంత్రి టూరిజం శాఖ మంత్రి కుమారి సెల్జా అడుగు పెట్టారు. 'మీకు మల్లె వాసన వస్తున్నదా' అని ఆమె ఆత్రుతతో కొందరు విలేకరులను అడిగారు. ఆ గదిలో సువాసనలు వెదజల్లడం కోసం ప్రత్యేకమైన జాస్మిన్ ఎస్సెన్షియల్ ఆయిల్ ను తెప్పించినట్లున్నారు. ప్రతి టేబుల్ పైన ఎత్తులో పూలను అమర్చారు. జలతరంగిణి, తబలా వాద్య సంగీతాన్ని నేపథ్యంలో వినిపించారు. అయితే, ముందు వార్తల కోసం, తరువాత ఆహారం కోసం తహతహలాడుతున్న విలేకరులకు ఆ సంగీతమేమీ చెవికెక్కలేదు.
అతిథుల జాబితాను ఆచితూచి రూపొందించారు. 300 మందికి పైగా విలేకరులతో పాటు ప్రస్తుత, పూర్వపు అధికార ప్రతినిధులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ప్రస్తుత సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోని మాత్రమే ఆహ్వానితులు. టివి కెమెరాలు తీసుకురాకూడదు. ఫోటోగ్రాఫర్లు రాకూడదు. కేవలం ధన్యవాదాలకు ఇది పరిమితం. దీనిని వార్తగా పంపరాదనే ఆంక్ష విధించారు.
సూప్ ను సర్వ్ చేసిన తరువాత సోనియా గాంధి హాలులోకి వచ్చారు. ఆహారం పాపులర్ వంటకాలతో కూడుకున్నది. తూర్పు ప్రాంతానికి చెందిన మచ్చెర్ ఝోల్, అప్పాలు, పాయసం, గత్తె కి సబ్జీ, పాస్తా, హాంకాంగ్ చైసీన్ ఫుడ్, అవధ్ ప్రాంతం ఆహార పదార్థాలు ఉన్నాయి. రకరకాల డెస్సర్ట్ లు, రబ్డీ, జిలేబి, లెమన్ చీజ్ కేక్, మూడు రుచుల కుల్ఫీ కూడా సర్వ్ చేశారు.
అయితే, సోనియా గాంధితో మాట్లాడేందుకు వీలుగా సీట్లు ఏర్పాటు చేసి ఉంటే విలేకరులు ఈ ఆహారాన్ని కూడా వదలుకోవడానికి సిద్ధపడేవారే. కాని వారిని రౌండ్ టేబుల్స్ వద్ద కూర్చోబెట్టారు. ఆమె వచ్చి, నేరుగా ఒక టేబుల్ వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ హలో అని పలకరించారు. వారి పేర్లను ఆమె తెలుసుకున్నారు. (చాలా మంది తమ విజిటింగ్ కార్డులు అందజేశారు). తరువాత ఆమె మరొక టేబుల్ వద్దకు వెళ్ళారు. అలా ఆమె అన్ని టేబుల్స్ వద్దకు వెళ్ళారు. ఆమె ఒకటి రెండు ప్రశ్నలకు అవకాశం ఇచ్చి చివరకు తన లంచ్ కోసం ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. ఆమె చుట్టూ ఆమె బృందం ఉన్నది.
సోనియా గోధుమ రంగు దుస్తులు ధరించగా ఆమె భద్రతా సిబ్బంది నల్ల దుస్తులలో ఉన్నారు. ఆమె చాలా తక్కువగా భుజించారు. ఆమె ఉత్సాహంగా చాలా విజిటింగ్ కార్డులను స్వీకరించారు. ప్రతి ఒక్కరూ తిన్నారని నిర్థారణ చేసుకున్న తరువాత అక్కడి నుంచి నిష్క్రమించారు. మంత్రులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఆ వెంటనే వెళ్ళిపోయారు. చివరకు అక్కడ మిగిలింది జలతరంగిణి వాద్య సంగీతం మాత్రమే.
Pages: -1- 2 News Posted: 11 June, 2009
|