'గ్రామీణ' సేవలో సిఎలు
మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ సమితి వ్యవస్థాపకురాలు, 'జన్ సున్ వాయిస్' (బహిరంగ విచారణల), ఎన్ఆర్ఇజిపి సోషల్ ఆడిట్ కోసం ప్రతిపాదన చేసిన వ్యక్తి, సంఘ సేవకురాలు అరుణా రాయ్ ఈ విషయమై మాట్లాడుతూ, సోషల్ ఆడిట్లకు సాయంగా చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలను ఉపయోగించుకోవాలనే ప్రతిపాదన సూత్రప్రాయంగా మంచిదేనని పేర్కొన్నారు.అయితే, ఆడిట్ల వల్ల అక్రమాలను కనుగొనడం లేదా నివారించడం సాధ్యమని భావించలేమని ఆమె వాదిస్తున్నారు. 'ఆర్థికపరమైన ఆడిట్ల తరువాత మోసాలలో చాలా వరకు జరిగినట్లు కనుగొన్నారు' అని ఆమె చెప్పారు.
'పథకం గురించిన హామీలు ఫలితాలకు సరితూగుతున్నాయా అనేది భౌతికంగా తనిఖీ చేయడం అవసరం. ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములైనప్పుడే అది సాధ్యం' అని ఆమె సూచించారు. 'సమాజం సోషల్ ఆడిట్ కు చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలు జత కూడితే అంతకు మించినదేమీ ఉండదు' అని అరుణా రాయ్ అన్నారు.
కాగా, ఐసిఎఐ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ బాధ్యతలలో పాలు పంచుకుంటున్నదని చోప్రా తెలిపారు. సింగిల్ ఎంట్రీ విధానం నుంచి డబుల్ ఎంట్రీ విధానానికి మారడంలో ఢిల్లీ, కోలకతా మునిసిపల్ కార్పొరేషన్ లకు ఐసిఎఐ సాయం చేసిందని ఆయన తెలిపారు.
'ఎన్ఆర్ఇజిపి వంటి పథకం కోసం పని చేయగల సామర్థ్యం మాకు ఉన్నది' అని ఆయన చెప్పారు. ఈ డబ్బును ఎవరికైతే ఉద్దేశించారో వారికే అందేట్లు చూడడమే ఈ ప్రతిపాదన లక్ష్యమని ఆయన చెప్పారు. అన్ని స్థాయిలలో పథకంలో పాలుపంచుకుంటున్న అధికారులపై ఐసిఎఐ పరిశీలన జరుపుతుందని చోప్రా తెలిపారు.
Pages: -1- 2 News Posted: 11 June, 2009
|