టార్గెట్ తెరాస!
కాగా, మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలపై మీడియాకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశించారు. గతం నుండి మీడియాపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఈసారి ముఖ్యమంత్రి తనసహచర మంత్రులకు ఇదే అంశంపై గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. అందుకే సమావేశం అనంతరం బయటకు వచ్చిన మంత్రి పొన్నాలను కలిసేందుకు విలేఖరులు ప్రయత్నించగా, 24 గంటలపాటు మీరెవరో... నేనెవరో అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. మరికొంత మంత్రి మంత్రులు కూడా దాదాపు మీడియాకు ముఖం చాటేసే ప్రయత్నాలుచేశారు. ఇలా ఉండగా, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే సత్తా కేవలం కాంగ్రెస్ కే ఉందని, తెలంగాణాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డా.జె.గీతారెడ్డి చెప్పారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశం అధికారిక అంశాలపై చర్చ పూర్తయిన తర్వాత ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. సిఎం ప్రసంగం తెలంగాణా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిందన్నారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధిపై కాంగ్రెస్ చూపించిన శ్రద్ధ ఏ ఇతర పార్టీ చూపించలేదని వివరించారు.
గత ఐదేళ్ళలో తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఉపాది అవకాశలు మెరుగుపరచడం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)పట్ల ఆ పార్టీ అధినేత కెసిఆర్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. అందుకే టిఆర్ఎస్ యాభై స్థానాల్లో పోటీ చేస్తే కేవలంపది స్థానాల్లోనే విజయం సాధించిందని వివరించారు. తెలంగాణా సాధించడం టిఆర్ఎస్ వల్ల, కెసిఆర్ వల్ల సాధ్యం కాదని, అది కాంగ్రెస్ వల్లే సాధ్యమని అన్నారు. తెలంగాణలోని అధిక శాతం జిల్లాలు ప్రధానమైన రంగాల్లో వెనుకబడి ఉన్నాయని, సాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజల ఆర్థిక స్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టలను భారీ ఎత్తున చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ పార్టీని, వైఎస్ ను తెలంగాణా ప్రజలు నమ్మారని అందుకే తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కు కట్టబెట్టారన్నారు. ఈ పరిస్థితిలోనే తాము (తెలంగాణా మంత్రులు) ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించామని గీత వివరించారు.
Pages: -1- 2 News Posted: 12 June, 2009
|