అంతా సాటిలేని మంత్రులే!
ఇది ఇలా ఉండగా, పరిస్థితులలో మార్పు తీసుకురాగల మంత్రుల పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం నమ్మకం వ్యక్తం చేస్తున్నది. 'మంత్రి మండలి నిజంగా అద్భుతమైన కూర్పు. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులు, విద్యావంతులు మనకు ఉన్నారు. దేశంలో లేదా విదేశాలలో చదువుకున్న, అత్యున్నత విద్యార్హతలు ఉన్న మంత్రులతో కూడుకున్న మండలి. ఈ బృందం సత్ఫలితాలు సాధించడం తథ్యం' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ పేర్కొన్నారు.
ఐవీ లీగ్ మంత్రులలో అధిక సంఖ్యాకులు కాంగ్రెస్ వారే అయినప్పటికీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన దినేష్ త్రివేది వంటి మంత్రులు కొందరు కూడా విదేశాలలో చదువుకున్నారు. త్రివేది టెక్సాస్ యూనివర్శిటీలో ఎంబిఎ చేశారు. ఐవీ లీగ్ సభ్యులే కాకుండా కాంగ్రెస్ వారిలో రక్షణ శాఖ సహాయ మంత్రి ఎం.ఎం. పళ్ళంరాజు ఫిలడెల్ఫియాలో టెంపుల్ యూనివర్శిటీ నుంచి ఎంబిఎ పట్టా పొందారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని కూడా విదేశాలలో భాషా శాస్త్రంలో విద్యార్జన చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుదలకు కారకులైన కీలక నాయకులలో ఒకరైన రాహుల్ గాంధి కూడా కేంబ్రిడ్జిలో పూర్వ విద్యార్థే.
ఇక మంత్రి మండలిలో న్యాయవాదులకు కూడా కొదువ లేదు. వారిలో ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబల్, ప్రదీప్ జైన్, హరీష్ రావత్ (కాంగ్రెస్), ఎస్.ఎస్. పళనిమాణిక్యం (డిఎంకె), ఇ. అహ్మద్ (ముస్లిం లీగ్), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) కూడా ఉన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తొలి ప్రధాని కేంబ్రిడ్జి పూర్వ విద్యార్థి జవహర్ లాల్ నెహ్రూ నెలకొల్పిన ఆనవాయితీని మన్మోహన్ సింగ్ కొంత వరకు పాటించారు. కృష్ణ మీనన్ వంటి విదేశీ విద్యాధిక మంత్రులు పలువురు నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నారు.
15వ సార్వత్రిక లోక్ సభ ఎన్నికలలో కొంత భాగం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన నవీన్ చావ్లా కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. కాగా, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ లోక్ సభ సభ్యుడు ప్రేమ్ దాస్ రాయ్ ఐఐటి, ఐఐఎం రెండింటిలోను చదువుకున్న మొట్టమొదటి ఎంపి.
Pages: -1- 2 News Posted: 13 June, 2009
|