వైఎస్‌ది మళ్ళీ అదే దారి!
అయితే అలాగే గెలిచిన వారు అదే స్థాయిలో ఉన్నారు. ప్రస్తు తం ఈ నేతలంతా వై.ఎస్.పై పలు ఆశాలు పెట్టు కున్నారు. ఆయనతో ఉన్న సానిహిత్యం పదవు లలో అందలంఎక్కించేందుకు ఉపయోగటపడు తుందని వీరు ఉన్నారు. కానీఅందుకు భిన్నంగా వై.ఎస్. ధోరణీ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా గెలిచిన వారికి మంత్రివర్గంలోనూ కాకుండా, ఏ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలోనూ నియమించకూడదని నిర్ణ యించుకున్నట్లు సమాచారం. అదే సందర్భంలో ఎమ్మెల్సీలతో పాటు ఓడిన ఎమ్మెల్యే, మంత్రులను కూడా ఈ నామినేటెడ్ పదవులకు దూరంగా ఉంచాలని సిఎం భావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపో లేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటు న్నాయి. ప్రస్తుతం రాజశేఖర రెడ్డి ఎలాంటి శత్రువులు లేకుండా పార్టీలో తన కంటే ప్రత్యేక ముద్రవేసుకుని వెళ్తున్నారు. ఒకవేళ ఇలా ఓడినవారిని, తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తన అనుచరగణాన్ని అందలం ఎక్కిస్తే ఇతర సీని యర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశంలేదని సిఎం భావిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
ప్రాంతాల మధ్య అసమానతలను నివారించేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ప్రభుత్వం రద్దుచేయాలని యోచిస్తోంది. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షణ కోస్తా, తెలంగాణ అభివృద్ది బోర్డులను నాడు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంతేకాకుండా ఈ బోర్డులకు ఛైర్మన్లను కూడా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ అభివృద్ధి బోర్డుకు ఉప్పనూతల పురుషోత్తంరెడ్డి, రాయలసీమ అభివృద్ది బోర్డుకు గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు, కోస్తాంధ్ర అభివృద్ధిబోర్డుకు గాదె వెంకట్‌రెడ్డి, దక్షణాంధ్ర అభివృద్ధిబోర్డుకు సాంబ శివరాజును ప్రభుత్వం నియమించింది. కానీ ఈ బోర్డు ఛైర్మన్లుగా బాధ్యతలు చేపట్టేందుకు ఎవరు చాలా కాలం పాటు సుముఖం చూపలేదు. కానీ ఎట్టకేలకు తెలంగాణ ప్రాంత అభివృద్ధి బోర్డుఛైర్మన్‌గా ఉప్పనూతల పురుషోత్తంరెడ్డి బాధ్యతలు చేపట్టారు. కానీ మిగిలిన మూడు ప్రాంతాల బోర్డులు ఖాళీగా ఉండిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా సి.కె.బాబు బాధ్యతలు చేపట్టారు. ఈ బోర్డుల ఛైర్మన్లకు కేబినేట్ ర్యాంకు ఉంది. ఈ బోర్డులకు ఛైర్మన్లను నియమిస్తే వారికి కేబినేట్ ర్యాంకు ఇవ్వాలి. అంతేకాకుండా వారికో కార్యాలయం కేటాయించాలి. అందులో సిబ్బంది నియామకం జరగాలి. ఇన్ని తతంగాలు ఈ ప్రాంతీయ అభివృద్ధిబోర్డుల నిర్వహణలో ఉన్నాయి.
Pages: -1- 2 News Posted: 13 June, 2009
|